Monday 6 April 2015

hide చేసిన folders, files మీ పిల్లలు hidden folders లో చూస్తుర్రా? hidden folders లో సుత కనవడకుంట చెయ్యాలంటే ఇది సదువుర్రి

కామన్ గ కొన్ని సీక్రెట్ ఫైల్స్ కానీ folders కాని వేరే వాళ్ళకు కనవడకుంట ఉండేందుకు folder మీద right click చేసి properties కి వెళ్లి hidden అంటం. మళ్ళీ చూసుకోవాలంటే folder options కి వెళ్లి show hidden files అంటం.
ఇదంతా outdated. అందరికి తెల్సిన సంగతే.
show hidden files అన్నా సుత కనపడడ్డు అంటే గీ steps ఫాలో అవుర్రి
1. మీరు ఏ file/folder hide చెయ్యాలే అనుకుంటున్నరో ఆ ప్లేస్ కి వెళ్లి empty place దగ్గర shift+right click చేయ్యిర్రి.


ఒక popup menu అస్తది. open command widow here అనుర్రి.
2. గపుడు ఆ లొకేషన్ తో  command prompt ఓపెన్ అయితది.

గిపుడు ATTRIB +H +S "FOLDER/FILE NAME" అనుర్రి
ఆ ఫైల్ hide అయితది. hidden files కి పొయ్యి లెంకినా కనవడది.
మళ్ళా ఆ file/folder unhide చెయ్యాలంటే ATTRIB -H -S "FOLDER/FILENAME" అంటే సరిపోతది.

0 comments:

Post a Comment